ఇండియన్ క్రియేటర్స్‌పై యూట్యూబ్ ట్యాక్స్ ప్రభావముంటుందా?
దిశ, ఫీచర్స్ : డిజిటల్ మాధ్యమాలు వచ్చాక ప్రతీ ఒక్కరికి తమ కళను చూపించుకునే మార్గం దొరికింది. అలాంటివారికి యూట్యూబ్ ఓ చక్కని వేదికగా మారింది. సామాన్యులు సైతం సొంతంగా ఒక చానల్ పెట్టేసి తమదైన రీతిలో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ, హ్యాపీగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే కంటెంట్ క్రియేటర్లకు ట్యాక్స్ విధించనున్నట్లు యూట్యూబ్ తాజాగా వెల్లడించింది. ఆ ట్యాక్స్ ఏంటో తెలుసుకుందాం. అమెరికాలో లేని యూట్యూబర్లకు మాత్రమే వర్తించే ‘యూట్యూబ్ ట్యాక్స్’.. జూన్ నుంచి అమలు […]
దిశ, ఫీచర్స్ : డిజిటల్ మాధ్యమాలు వచ్చాక ప్రతీ ఒక్కరికి తమ కళను చూపించుకునే మార్గం దొరికింది. అలాంటివారికి యూట్యూబ్ ఓ చక్కని వేదికగా మారింది. సామాన్యులు సైతం సొంతంగా ఒక చానల్ పెట్టేసి తమదైన రీతిలో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ, హ్యాపీగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే కంటెంట్ క్రియేటర్లకు ట్యాక్స్ విధించనున్నట్లు యూట్యూబ్ తాజాగా వెల్లడించింది. ఆ ట్యాక్స్ ఏంటో తెలుసుకుందాం.
అమెరికాలో లేని యూట్యూబర్లకు మాత్రమే వర్తించే ‘యూట్యూబ్ ట్యాక్స్’.. జూన్ నుంచి అమలు కానుంది. ఇక ఈ ట్యాక్స్ చెల్లింపు విషయానికొస్తే.. అమెరికాలో ఉన్నవాళ్లు మన యూట్యూబ్ చానల్ చూస్తుంటే, ఆ వ్యూయర్‌షిప్ ఆధారంగా మనకు కొంత అమౌంట్ వస్తుంది. అటువంటి ఆదాయంపై 15 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అమెరికా వ్యూయర్లు ఎక్కువగా కలిగి ఉన్న వారి ఆదాయంపై ఇది ప్రభావం చూపనుంది. అయితే మెజార్టీ ఇండియన్ యూట్యూబ్ చానల్స్ భారతీయ వ్యూయర్‌షిప్ మీదే ఆధారపడుతున్నాయి. ఎలాగూ అమెరికా వ్యూయర్‌షిప్ తక్కువే ఉంటుంది కాబట్టి, ఈ ట్యాక్స్ ప్రభావం అంతగా ఉండదని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో 176 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న టి-సిరీస్ చానెల్‌కు అమెరికాలోనూ వ్యూయర్‌షిప్ ఎక్కువే. ఇలాంటి చానల్స్‌కు 15 శాతం ట్యాక్స్ అంటే ఎక్కువే అన్నది మార్కెట్ నిపుణుల అంచనా. మనతో పోలిస్తే యూఎస్‌లో సీపీఎం(Cost per 1,000 impressions) రేట్లు అధికంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్‌సైట్స్ హబ్ నివేదిక ప్రకారం యూఎస్‌లో యూట్యూబ్ సీపీఎం 3.44 డాలర్లు కాగా, భారతదేశంలో ఇది 0.28 డాలర్లు. కాబట్టి, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా ఉంటుంది. అందువల్ల 15 శాతం పన్ను చిన్న భాగం మాత్రమేనని వారంటున్నారు.
‘రాయల్టీలు యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో లేదా చెల్లింపు కంటెంట్ సేవల్లో ఒక భాగం. కాబట్టి ప్రకటన వీక్షణలు, యూట్యూబ్ ప్రీమియం మొదలైన వాటి నుంచి కంటెంట్ క్రియేటర్ సంపాదించేది ఏదైనా రాయల్టీ పరిధిలోకే వస్తుంది. ఈ చర్య ప్రతి యూట్యూబర్‌పై ప్రభావం చూపుతుంది. ఇది ఏ క్రియేటర్‌కు కూడా అనుకూలమైన వార్త కాదు’ అని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వ్యవస్థాపకుడు యువర్ థంగ్ వ్యవస్థాపకుడు అంకిత్ అగర్వాల్ వివరించారు.