యూట్యూబ్ టాప్‌లో ‘థ్యాంక్యూ డాక్టర్స్’ వీడియో
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో తొలి కరోనా కేసు జనవరిలో నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో పాటు ప్రపంచదేశాల్లో దాని తీవ్రతను గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 24 నుంచి లాక్‌డౌన్ విధించాయి. అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, 20 సెకన్ల పాటు హాండ్స్ వాష్ చేసుకోవడం, ఇంట్లోనే ఉండటం, మాస్క్ ధరించడం వంటి పలు సూచనలు కూడా చేశాయి. ఇదే క్రమంలో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో తొలి కరోనా కేసు జనవరిలో నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో పాటు ప్రపంచదేశాల్లో దాని తీవ్రతను గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 24 నుంచి లాక్‌డౌన్ విధించాయి. అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, 20 సెకన్ల పాటు హాండ్స్ వాష్ చేసుకోవడం, ఇంట్లోనే ఉండటం, మాస్క్ ధరించడం వంటి పలు సూచనలు కూడా చేశాయి. ఇదే క్రమంలో కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ సూచనలు పాటించేలా తమ యాడ్స్‌ను రూపొందించాయి.
సదరు కంపెనీలు ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన ‘పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్స్’ (యాడ్స్)ను హైలెట్ చేసేందుకు ‘మోస్ట్ పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్స్ యాడ్స్ లీడర్ బోర్డ్’ పేరుతో బుధవారం యూట్యూబ్.. ఆ లిస్టును విడుదల చేసింది. ఈ మూడు నెలల కాలంలో భారతీయులు ఎక్కువగా చూసిన టాప్ 10 యాడ్స్‌ను అందులో పొందుపరిచింది. గూగుల్స్ రూపొందించిన ‘థ్యాంక్యూ డాక్టర్స్, నర్సెస్ అండ్ ఆల్ హెల్త్‌కేర్ వర్కర్స్’ వీడియో టాప్ 1 ప్లేస్ సొంతం చేసుకుంది. దీన్ని 59 మిలియన్ల ప్రజలు వీక్షించారు. ఎస్‌బీఐ రూపొందించిన ‘ఘర్ మే ఖుషియా’ వీడియో 38 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది.
3. పార్లీ – లెట్స్ క్యాచ్ అప్ విత్ లైఫ్ (13 మిలియన్)
4. హెచ్‌డీఎఫ్‌సీ – హమ్ హర్ నహీ మానేంగే (10 మిలియన్లు)
5. కియా మోటర్స్ – లెట్స్ ఆల్ జస్ట్ రీవైండ్ (9 మిలియన్లు)