గణపతి శోభయాత్రలో ట్రైనీ ఎస్ఐ అత్యుత్సాహం.. యువకుల ధర్నా
దిశ, దుబ్బాక: దుబ్బాక పట్టణంలో నిర్వహించిన వినాయక నిమజ్జన శోభయాత్రలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కోలాహలం, చిన్నారులు నృత్యాలు మధ్య శోభాయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు యువజన సంఘాల నాయకులపై ట్రైనీ ఎస్ఐ చేర్యాల విజయ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో యువజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. తాము ఏ తప్పు చేయకపోయినా తమపై చేయి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన స్థానిక సీఐ హరికృష్ణ, ఎస్ఐ మన్నే […]
దిశ, దుబ్బాక: దుబ్బాక పట్టణంలో నిర్వహించిన వినాయక నిమజ్జన శోభయాత్రలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కోలాహలం, చిన్నారులు నృత్యాలు మధ్య శోభాయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు యువజన సంఘాల నాయకులపై ట్రైనీ ఎస్ఐ చేర్యాల విజయ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో యువజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. తాము ఏ తప్పు చేయకపోయినా తమపై చేయి చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన స్థానిక సీఐ హరికృష్ణ, ఎస్ఐ మన్నే స్వామిలు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను సర్దుమణిగించారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజుల క్రితం కూడా ఇదే ట్రైనీ ఎస్ఐపై పలు విమర్శలు వినిపించాయి. బాలాజీ వెంకటేశ్వర ఆలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా అత్యుత్సాహం చూపించినట్లు సమాచారం. అత్యుత్సాహం చూపిస్తున్న ట్రైనీ ఎస్‌ఐని ట్రాన్స్‌ఫర్ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.