కరోనా గురించి చెబితే చంపేశారు

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా గురించి సమాచారమిచ్చాడని ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా పలు జాగ్రత్తలు పాటించాలని, అందులో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే తమకు సమాచారమివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సీతామార్హీ జిల్లా పరిధిలోని మాధోల్ గ్రామానికి ఇద్దరు యువకులు వచ్చారు. వారు మహారాష్ట్ర నుంచి వచ్చారు. అయితే ఆ యువకులకు […]

Update: 2020-03-31 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా గురించి సమాచారమిచ్చాడని ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా పలు జాగ్రత్తలు పాటించాలని, అందులో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే తమకు సమాచారమివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సీతామార్హీ జిల్లా పరిధిలోని మాధోల్ గ్రామానికి ఇద్దరు యువకులు వచ్చారు. వారు మహారాష్ట్ర నుంచి వచ్చారు. అయితే ఆ యువకులకు కరోనా సోకినట్లు అనుమానం కలుగుతుందని వైద్యాధికారులకు ఆ గ్రామానికి ఓ యువకుడు సమాచారమిచ్చాడు. దీంతో వైద్యబృందం అక్కడికి చేరుకుని వారిద్దరిని తమతోపాటు తీసుకెళ్లి పరీక్షలు చేసింది. అనంతరం వారికి కరోనా సోకలేదని వారిద్దరని తిరిగి పంపించింది. దీంతో వారిద్దరూ ఊరు చేరుకున్నారు. అనంతరం వారు… వైద్యబృందానికి సమాచారమిచ్చిన ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన ఆ ఇద్దరు యువకులతోపాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

Tags: Bihar, Corona, two teenagers attacked, victim killed, Maharashtra, riot, police, case registered

Tags:    

Similar News