ఉద్యోగం దొరకలేదని.. రూపం మార్చిన యువకుడు
దిశ, ఫీచర్స్ : ‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అనే మాటలో ఎలాంటి సందేహం లేదు. పుస్తకాల విషయంలోనే కాదు, మనుషుల విషయంలోనూ ఈ మాటలు వర్తిస్తాయి. ఇండియా అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనూ వ్యక్తి వేషధారణను చూసి అతని వ్యక్తిత్వాన్ని, నాలెడ్జ్‌ను డిసైడ్ చేస్తుంటారు. కానీ ఎవరినైనా సరే.. రూపం, వేషధారణ ఆధారంగా హేళన చేయడం మంచి లక్షణం కాదు. అయితే వియత్నాంకు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి […]
దిశ, ఫీచర్స్ : ‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అనే మాటలో ఎలాంటి సందేహం లేదు. పుస్తకాల విషయంలోనే కాదు, మనుషుల విషయంలోనూ ఈ మాటలు వర్తిస్తాయి. ఇండియా అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనూ వ్యక్తి వేషధారణను చూసి అతని వ్యక్తిత్వాన్ని, నాలెడ్జ్‌ను డిసైడ్ చేస్తుంటారు. కానీ ఎవరినైనా సరే.. రూపం, వేషధారణ ఆధారంగా హేళన చేయడం మంచి లక్షణం కాదు. అయితే వియత్నాంకు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. నిరుద్యోగి అయిన డూ క్వాన్ ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకు వెళ్లగా.. అక్కడి ఇంటర్వూయర్ సహా ఇతరులు కూడా తన అటైర్ చూసి నవ్వారు. దాంతో ఎంతో బాధపడ్డ క్వాన్, కొద్ది రోజుల్లోనే అందరూ ఆశ్చర్యపోయే రీతిలో మారిపోయాడు.
తన రూపం కారణంగా ఎగతాళికి గురైన టిక్‌టాక్ యూజర్ డూ క్వాన్.. ప్లాస్టిక్ సర్జరీతో ముఖాన్ని మార్చుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇందుకోసం ఏకంగా తొమ్మిది సర్జరీలు చేసుకున్నాడు. సర్జరీ తర్వాత మారిన ఫొటోలతో పాటు తన పాత ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, క్వాన్ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అతడు తన పాత రూపానికి సంబంధం లేకుండా, గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ క్రమంలో ‘రైనోప్లాస్టీ, చిన్ ఇంప్లాంట్స్, పొర్సిలేన్ వీనీర్స్, లిప్ రీషేపింగ్, లిప్ ఇంప్లాంట్స్, డబుల్ ఐలిడ్’ శస్త్రచికిత్సలతో సహా తొమ్మిది ప్రధాన ప్లాస్టిక్ సర్జరీల కోసం 400 మిలియన్ డాంగ్ (17,400 డాలర్లు) ఖర్చు చేశారు. ప్రస్తుతానికి క్వాన్.. మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
‘నా లుక్ వల్ల ఉద్యోగం సంపాదించడం కష్టమైంది. ఇంటర్వ్యూలో నన్ను చూసి ఎగతాళి చేసిన తర్వాత, నన్ను నేను మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నాను. అప్పటిదాకా పొదుపు చేసిన డబ్బును సర్జరీల కోసం వెచ్చించాను. సర్జరీ తర్వాత మొదటిసారి ఇంటికెళ్తే.. నా తల్లిదండ్రులు కూడా గుర్తించలేదు. ఇప్పటికీ చాలా మంది నాపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ నేను చేసింది కరెక్ట్ అని నాకనిపిస్తోంది. ఎల్లప్పుడూ దృఢంగా ఉండండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. అందానికి ఎటువంటి ప్రమాణాలు లేవు. కానీ మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీపై మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం కలగాలి’ అని డూ క్వాన్ పేర్కొన్నాడు.