తల్లి మందలింపు.. కొడుకు ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: మాట వినడంలేదని కొడుకును తల్లి మందలించింది. అంత మాత్రానికే ఆ తల్లికి కొడుకు కడుపు కోత మిగిల్చాడు. అమ్మ తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లా జిల్లా తంగెళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సాయికుమార్.. తన తల్లి మందలించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో ఈ నెల 26న ఇంట్లో నుంచి వెళ్లి ఎంతకీ తిరిగి […]

Update: 2020-08-29 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాట వినడంలేదని కొడుకును తల్లి మందలించింది. అంత మాత్రానికే ఆ తల్లికి కొడుకు కడుపు కోత మిగిల్చాడు. అమ్మ తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిరిసిల్లా జిల్లా తంగెళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సాయికుమార్.. తన తల్లి మందలించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో ఈ నెల 26న ఇంట్లో నుంచి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు సాయి కుమార్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే, ఈ రోజు ఉదయం సాయికుమార్ తంగెళ్లపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ భూమిలో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    

Similar News