గోదావరిఖనిలో గంజాయి కలకలం.. యువకుడు అరెస్ట్

దిశ, గోదావరిఖని : గత కొంత కాలంగా గంజాయి అమ్ముకుంటూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న దేవొజీ వేణు అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్ రైల్వే పట్టాల వద్ద వన్ టౌన్ ఎస్ఐ ఉమాసాగర్ తన సిబ్బందితో కలిసి వేణును పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ గిరి […]

Update: 2021-10-28 03:51 GMT

దిశ, గోదావరిఖని : గత కొంత కాలంగా గంజాయి అమ్ముకుంటూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న దేవొజీ వేణు అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్ రైల్వే పట్టాల వద్ద వన్ టౌన్ ఎస్ఐ ఉమాసాగర్ తన సిబ్బందితో కలిసి వేణును పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ గిరి ప్రసాద్ మాట్లాడుతూ.. యువత ఎక్కువగా గంజాయికి బానిస గా మారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ప్రవర్తనను గమనించాలని కోరారు. ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు. ఎక్కువ సమయాన్ని ఎవరితో గడుపుతున్నారో వారిపట్ల దృష్టి సారించాలని చెప్పారు.

గంజాయి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా డయల్ 100కు గానీ, అధికారులకు గానీ నేరుగా సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి అమ్మినా లేదా కొన్నా, సేవించినా.. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడిని పట్టుకున్న గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై ఉమా సాగర్, కానిస్టేబుల్స్ హిమసుందర్, తీట్ల శ్రీనివాస్, గోపతి వెంకటేష్, హోంగార్డు శేఖర్‌లను ఏసీపీ అభినందించారు.

 

Tags:    

Similar News