వివాహమైన 24 గంటల్లోనే ప్రేమించిన వ్యక్తితో..

దిశ, నల్లగొండ: మొన్న పెద్దల కుదిర్చిన పెళ్లి.. నిన్న ప్రేమ పెళ్లి.. ఇదేదో సినిమాలో సీన్ కాదు.. నిజ జీవితంలో జరిగిన ఘటన. ఓ అమ్మాయి ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి మండపంలోకి యువతిని ప్రేమించిన యువకుడు వచ్చాడు. అతడిని గట్టిగా పట్టుకుని పెళ్లి కూతురు ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి మరుసటి […]

Update: 2020-06-14 06:02 GMT

దిశ, నల్లగొండ: మొన్న పెద్దల కుదిర్చిన పెళ్లి.. నిన్న ప్రేమ పెళ్లి.. ఇదేదో సినిమాలో సీన్ కాదు.. నిజ జీవితంలో జరిగిన ఘటన. ఓ అమ్మాయి ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో చెప్పలేక పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి మండపంలోకి యువతిని ప్రేమించిన యువకుడు వచ్చాడు. అతడిని గట్టిగా పట్టుకుని పెళ్లి కూతురు ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి మరుసటి రోజు ప్రేమించిన యువకుడితో వివాహం చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో చోటుచేసుకుంది.

కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన మౌనికకు దేవరకొండకు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 12న వారి వివాహం కూడా జరిగిపోయింది. అప్పుడే అసలు కథ మొదలైంది. మౌనిక తనకు వరుసకు మామయ్య అయ్యే రాజేశ్​తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు మౌనికకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ప్రేమ విషయం పెద్దలకు చెప్పే ధైర్యం‌లేని మౌనిక పెళ్లికి అంగీకరించింది. వివాహమూ చేసుకుంది. కట్​చేస్తే పెళ్లయిన కాసేపటికి అక్కడికి రాజేశ్​ వచ్చాడు. అతడిని చూసిన మౌనిక.. వెంటనే అతడిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. దీంతో మౌనికను పెళ్లి చేసుకున్న యువకుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. ఇంతలోనే రంగంలోకి పోలీసులు దిగారు. పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు మగ పెళ్లివారు తేల్చి చెప్పారు. దీంతో ఈ నెల 13న రాజేశ్​, మౌనికలు మళ్లీ వివాహం చేసుకున్నారు.

Tags:    

Similar News