ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు

దిశ, మెదక్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన శుక్రవారం నంగునూరులో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొడముంజ భాస్కర్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి నిశ్చయించుకుని.. ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి బట్టలు సైతం మార్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భాస్కర్ […]

Update: 2020-06-05 04:05 GMT

దిశ, మెదక్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన శుక్రవారం నంగునూరులో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొడముంజ భాస్కర్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి నిశ్చయించుకుని.. ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి బట్టలు సైతం మార్చుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భాస్కర్ కనపడకపోవడంతో బుధవారం శారద ప్రియుడి ఇంటికి వెళ్లింది. భాస్కర్ లేడని తెలియడంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటి ఎదుట కూర్చొని ఆందోళన చేసింది. తనను మోసం చేసిన భాస్కర్‌పై రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంతవరకూ కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది. ఆ అమ్మాయిని గమనించిన ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

Tags:    

Similar News