బిస్కెట్ టేస్ట్ చేస్తే.. లక్షల్లో జీతం!

దిశ, వెబ్‌డెస్క్ : విపరీతంగా టాలెంట్ ఉండి, ఎంత కష్టపడినా సరే.. స్థాయికి తగ్గ జీతం రావడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. కానీ మార్కెట్లో పరిస్థితుల కారణంగా ఉన్న ఉద్యోగంతోనే సరిపెట్టుకునే జాబర్స్ కూడా ఉన్నారు. అయితే ఎటువంటి కష్టం లేకుండానే, అది కూడా 35 రోజుల వెకేషన్ హాలీడేస్‌లో నెలకు మూడు లక్షలపైనే జీతం ఇచ్చే ఉద్యోగం దొరికితే? కాదని ఎవరైనా అంటారా? అలాంటి ఉద్యోగమే ఇస్తానని స్కాట్లాండ్‌కు చెందిన బోర్డర్ బిస్కెట్ కంపెనీ […]

Update: 2020-10-27 03:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విపరీతంగా టాలెంట్ ఉండి, ఎంత కష్టపడినా సరే.. స్థాయికి తగ్గ జీతం రావడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. కానీ మార్కెట్లో పరిస్థితుల కారణంగా ఉన్న ఉద్యోగంతోనే సరిపెట్టుకునే జాబర్స్ కూడా ఉన్నారు. అయితే ఎటువంటి కష్టం లేకుండానే, అది కూడా 35 రోజుల వెకేషన్ హాలీడేస్‌లో నెలకు మూడు లక్షలపైనే జీతం ఇచ్చే ఉద్యోగం దొరికితే? కాదని ఎవరైనా అంటారా? అలాంటి ఉద్యోగమే ఇస్తానని స్కాట్లాండ్‌కు చెందిన బోర్డర్ బిస్కెట్ కంపెనీ ఆఫర్ చేస్తోంది.

సంవత్సరానికి 40 వేల పౌండ్లు అంటే.. నెలకు మూడు లక్షలకు పైగానే జీతం. జీతంతో పాటు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. మరి ఇన్ని ఫెసిలిటీస్ అందిస్తుంటే.. ఆ ఉద్యోగం కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుందో అని ఆలోచించకండి. జాబ్ చాలా సింపుల్. బోర్డర్ కంపెనీ నూతనంగా తయారుచేస్తున్న బిస్కెట్లను రుచి చూసి అవి ఎలా ఉన్నాయో చెబితే చాలు.. ఆకర్షణీయమైన జీతం మీ అకౌంట్లో పడిపోతుంది. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. అదేంటంటే.. ఈ ఉద్యోగం పొందాలంటే ప్రత్యేక ప్రతిభ ఉండాలి. అందుకోసం బిస్కెట్లపై మంచి పరిజ్ఞానంతో పాటు కస్టమర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన సూచనలు ఇచ్చే వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. బేకరీ ప్రొడక్ట్స్, టెక్నికల్ సైడ్ ఆఫ్ బేకింగ్స్, న్యూ ఫ్లేవర్స్ గుర్తుపట్టడం , బేకింగ్‌లో కాస్త అనుభవం అవసరముంటుంది. మరి ‘మాస్టర్ బిస్కెటర్’గా ఎంపికైతే.. 1000కి పైగా రిటైలర్స్‌లో డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ఉచితంగా ఆన్‌లైన్ వ్యాయామ కార్యక్రమాలు, బిస్కెట్లు కూడా అందిస్తారు.

‘ప్రతి రోజు డెలిషియస్ ట్రీట్స్ అనుభవిస్తూ.. అందుకు తగ్గ జీతం అందుకోవడానికి ఇదో మంచి అవకాశం. అంతేకాదు సక్సెస్‌ఫుల్ క్యాండేట్ ‘మాస్టర్ బిస్కెటర్’గా గుర్తింపు పొందడమే కాదు, టీమ్‌ను లీడ్ చేస్తూ.. కొత్త రకమైన బిస్కెట్లకు కొత్త ఐడియాలను ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ పీపుల్స్‌ను మేం ఆహ్వానిస్తున్నాం. ఇంటర్య్వూ ఆధారంగా ఎంపిక చేస్తాం’ అని బోర్డర్ బిస్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ పార్కిన్స్ తెలిపాడు.

Tags:    

Similar News