మీకు ఆధార్ కార్డ్ ఉందా.. బంపర్ 'ఆఫర్' మీ సొంతం..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆధార్ ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసిందే. ప్రతీ పనికి ఆధార్ కార్డు కావాల్సిందే. మీ ఆధార్ కార్డు మిమ్మల్ని ఇబ్బందుల నుంచి ఆదుకుంటుందన్న విషయం మీకు తెలుసా?. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మీ ఆధార్ కార్డు.. ఓ ఏటీఎంలా పని చేస్తుంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. మీ ఆధార్ కార్డుతో లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా.. మీ గుర్తింపును నిరూపించడానికి […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఆధార్ ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసిందే. ప్రతీ పనికి ఆధార్ కార్డు కావాల్సిందే. మీ ఆధార్ కార్డు మిమ్మల్ని ఇబ్బందుల నుంచి ఆదుకుంటుందన్న విషయం మీకు తెలుసా?. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మీ ఆధార్ కార్డు.. ఓ ఏటీఎంలా పని చేస్తుంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. మీ ఆధార్ కార్డుతో లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారా..
మీ గుర్తింపును నిరూపించడానికి ప్రతీ బ్యాంక్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటుంది కదా. ఈ పనిని KYC అనే ప్రత్యేక ప్రక్రియ కింద చేస్తారు. ఈ పత్రాలు KYC కింద మాత్రమే బ్యాంకుల నుంచి తీసుకుంటారు. ఆధార్ కార్డు అత్యంత చెల్లుబాటు అయ్యే KYC డాక్యుమెంట్. ఇది ఏకకాలంలో గుర్తింపు, చిరునామాను అందిస్తుంది. మీకు ఆధార్ ద్వారా పర్సనల్ లోన్ కావాలంటే, మీరు ఆన్‌లైన్‌లో బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో E-KYC పత్రాలను అప్‌లోడ్ చేయాలి. UIDAI, ఆధార్ ఏజెన్సీ, వ్యక్తి ఆధార్ కార్డ్ నంబర్, బయోమెట్రిక్ వివరాలు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోటోను సేవ్ చేస్తుంది. అందువల్ల లోన్ తీసుకునే ముందు మీరు ఎలాంటి హార్డ్ కాపీని అందించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ఎలా చేయాలి..
– లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
– మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉందో లేదా ఆ బ్యాంక్ పోర్టల్‌లో తెలుసుకోండి.
– మీరు బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ మీరు పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసే లోన్ ఆప్షన్ చూడవచ్చు.
– మీరు రుణం తీసుకోవడానికి అర్హులు అవునా.. కాదా.. అనే విషయం ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు.
– అర్హులైతే OK ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
– ఇప్పుడు మిమ్మల్ని ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయమని అడుగుతారు. (ఇందులో మీ వ్యక్తిగత సమాచారం, ఉద్యోగం, వృత్తి గురించి సమాచారం తెలపాలి).
– ఇవన్నీ చేసిన తర్వాత, బ్యాంక్ ఉద్యోగి మీకు ఫోన్ చేసి వివరాలను ధృవీకరిస్తారు.
– ఆధార్ కార్డు కాపీని అప్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతారు.
– మీ ఆధార్ వివరాలను బ్యాంక్ ధృవీకరించిన వెంటనే, లోన్ డబ్బు మీ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
ఈ సదుపాయాన్ని పొందడానికి కనీస వయోపరిమితి 23 సంవత్సరాలు, గరిష్టంగా 60 సంవత్సరాలు. దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా MNC కంపెనీలో పనిచేస్తూ ఉండాలి. లోన్ పొందడానికి మీరు తప్పనిసరిగా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి.
ఇవి కూడా చదవండి :
Post Office FD Interest Rates: పోస్టాఫీసులో FD ల పై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
Post Office Scheme: 417 రూపాయల పొదుపుతో కళ్లు చెదిరే లాభం
Post Office Savings Schemes :పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఈ కొత్త రూల్ తెలుసా?