ఐఫోన్లలో ఆండ్రాయిడ్

దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్నంత ఫ్లెక్సిబులిటీ ఆపిల్ వారి ఐఫోన్లలో ఉండదు అనేది ఐఫోన్ వినియోగదారుల ప్రధాన వాదన. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ టూల్ ద్వారా ఐఫోన్లలో గూగుల్ వారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రన్ చేసుకోగల సౌకర్యం కలగనుంది. కొరిల్లియం అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన డేవిడ్ వాంగ్ బృందం ఈ టూల్ కనిపెట్టారు. దీని సాయంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడళ్లలో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ […]

Update: 2020-03-07 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్:

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్నంత ఫ్లెక్సిబులిటీ ఆపిల్ వారి ఐఫోన్లలో ఉండదు అనేది ఐఫోన్ వినియోగదారుల ప్రధాన వాదన. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ టూల్ ద్వారా ఐఫోన్లలో గూగుల్ వారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రన్ చేసుకోగల సౌకర్యం కలగనుంది. కొరిల్లియం అనే సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన డేవిడ్ వాంగ్ బృందం ఈ టూల్ కనిపెట్టారు. దీని సాయంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడళ్లలో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించుకోవచ్చు. ప్రాజెక్టు సాండ్‌కాజిల్‌లో భాగంగా ఈ టూల్‌ని వాంగ్ బృందం అభివృద్ధి చేశారు.

ప్రాజెక్ట్ సాండ్ కాజిల్ అంటే?

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇతర ఆధునిక పరికరాల్లోకి పోర్టింగ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ సాండ్ కాజిల్ ఉద్దేశం. చిప్ సెట్‌ల ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ పోర్టింగ్‌ని సాధ్యం చేయవచ్చు. గతేడాది నింటెండో స్విచ్‌కి ఆండ్రాయిడ్‌ని విజయవంతంగా పోర్ట్ చేయగలిగారు. కానీ ఐఫోన్లలోకి ఆండ్రాయిడ్‌ని పోర్ట్ చేయగలగడం చాలా కష్టమైన పనే. కానీ ఇందుకోసం సపోర్టింగ్ డ్రైవర్లను సొంతంగా అభివృద్ధి చేసి ఈ పనిని సాధ్యం చేయగలిగారు.

ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది?

చక్రా1ఎన్ అనే జైల్ బ్రేకింగ్ టూల్ ద్వారా ఇది సాధ్యమైంది. దీన్ని ఐఓఎస్ హ్యాకింగ్ కమ్యూనిటీ వారు డిజైన్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టును రన్ చేయడానికి టెథరింగ్ చేసిన పీసీలో చక్రా1ఎన్ ఇన్‌స్టాల్ చేయాలి. అంతేకాకుండా జైల్ బ్రేకింగ్ చేయడానికి ఐఫోన్ కూడా కావాలి. చక్రా1ఎన్ కేవలం మ్యాక్ ఓఎస్, లైనెక్స్‌లలో మాత్రమే పనిచేస్తుంది.

అడ్డుగోడలేంటి?

ఐఫోన్‌లలో ఆండ్రాయిడ్ వాడటమనేది చాలా అవరోధాలతో కూడి ఉన్న పని. దీని ద్వారా ఫోన్లో చాలా యాప్స్ సరిగా పనిచేయకపోవచ్చు. అంతేకాకుండా గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యం కూడా ఉండదు.

Tags: IPhone, Android, Portable, Operating System, MAcOs, Linux, Checkra1n

Tags:    

Similar News