మాస్క్ తీయకుండానే తినొచ్చు..

దిశ, వెబ్‌డెస్క్: కరోనా అందరి లైఫ్‌స్టైల్‌ను మార్చేసింది. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకెళ్లినా, ప్రయాణాలు చేయాలన్నా.. మాస్క్ మస్ట్. మరి ఏదైనా తినాలన్నా, తాగాలన్నా.. మాస్క్ తీసేయడం కామనే కదా! అయితే ఇక ముందు ఆ అవసరం లేదు. మాస్క్ ఉన్నా.. హాయిగా భోజనం చేయొచ్చు. అదెలా సాధ్యం అంటారా? మన జీవితాల్లో మాస్క్ తప్పనిసరి కావడంతో.. మాస్క్‌పై కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్యాషన్ ప్రియులు డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే మాస్క్‌ను రూపొందిస్తే.. టెక్ నిపుణులు, సెన్సార్ల […]

Update: 2020-05-20 03:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా అందరి లైఫ్‌స్టైల్‌ను మార్చేసింది. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకెళ్లినా, ప్రయాణాలు చేయాలన్నా.. మాస్క్ మస్ట్. మరి ఏదైనా తినాలన్నా, తాగాలన్నా.. మాస్క్ తీసేయడం కామనే కదా! అయితే ఇక ముందు ఆ అవసరం లేదు. మాస్క్ ఉన్నా.. హాయిగా భోజనం చేయొచ్చు. అదెలా సాధ్యం అంటారా?

మన జీవితాల్లో మాస్క్ తప్పనిసరి కావడంతో.. మాస్క్‌పై కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్యాషన్ ప్రియులు డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే మాస్క్‌ను రూపొందిస్తే.. టెక్ నిపుణులు, సెన్సార్ల సాయంతో కరోనాను గుర్తించే టెక్నాలజీని డెవలప్ చేశారు. ఇప్పుడు రిమోట్ సెన్సార్ మాస్క్ వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎవిటిపస్ పేటెంట్స్, ఇన్వెన్షన్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. మాస్క్‌కు మధ్యలో ఓ స్లాట్ బిగించారు. చేతిలో ఉన్న హ్యాండ్ రిమోట్ సాయంతో ఆ స్లాట్‌ను ఓపెన్, క్లోజ్ చేయొచ్చు. అంతేకాదు ఫోర్క్ లేదా స్పూన్‌ను ఆ స్లాట్ దగ్గరకు తీసుకురాగానే ఆటోమెటిక్‌గా మాస్క్ స్లాట్ తెరుచుకుంటుంది. ‘ఇప్పటికే పేటెంట్ కోసం అప్లయ్ చేశాం, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తాం’ అని తయారీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అసఫ్ గిటెలీస్ తెలిపారు. దీని ధర రూ. 60 నుంచి 200 వరకు ఉండొచ్చన్నారు.

Tags:    

Similar News