యోగా ఎట్ హోమ్.. విత్ ఫ్యామిలీ
2014లో భారత ప్రధాని మోదీ యూఎన్ కౌన్సిల్‌లో ‘యోగా డే’ గురించి ప్రపోజ్ చేశారు. అందుకు ఐరాస సభ్య దేశాలు ఒప్పుకోవడంతో జూన్ 21న ‘ఇంటర్నేషనల్ యోగా డే’ జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి ఏడాది యోగా డేకు ఓ థీమ్ ఉంటూ వస్తోంది. అలాగే ఈ ఏడాది కూడా ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా’ అనే కొటేషన్‌ను ‘2020 యోగా థీమ్’గా నిర్ణయించారు. ఆరో ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ఇటీవలే మోదీ […]
2014లో భారత ప్రధాని మోదీ యూఎన్ కౌన్సిల్‌లో ‘యోగా డే’ గురించి ప్రపోజ్ చేశారు. అందుకు ఐరాస సభ్య దేశాలు ఒప్పుకోవడంతో జూన్ 21న ‘ఇంటర్నేషనల్ యోగా డే’ జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి ఏడాది యోగా డేకు ఓ థీమ్ ఉంటూ వస్తోంది. అలాగే ఈ ఏడాది కూడా ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా’ అనే కొటేషన్‌ను ‘2020 యోగా థీమ్’గా నిర్ణయించారు. ఆరో ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ఇటీవలే మోదీ ప్రసంగించారు. ‘కొవిడ్ నుంచి విముక్తి పొందాక యోగా మరింత పాపులర్ అవుతుందని, జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని’ మోదీ అన్నారు. యూత్ కూడా యోగా చేసేందుకు ఆసక్తి చూపడం శుభ పరిణామమన్నారు.
యోగా వల్ల శరీరం, మనసు రెండూ కూడా ప్రశాంతంగా ఉండటమే కాక ప్రాణాయామంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రెస్పిరేటరీ డిజార్డర్స్‌ను క్యూర్ చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల శరీరం తీసుకునే ఆక్సిజన్ శాతం 5 శాతం పెరిగి, అవయవాల పనితీరు మెరుగవుతుంది. వారానికో గంట పాటు యోగా చేస్తే.. మానసిక ఒత్తిడి నుంచి సులువుగా బయటపడొచ్చని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా తేల్చి చెప్పారు. ఈ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకుని మూడు నెలల పాటు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.
యోగా ఎట్ హెమ్ : ఈ ఏడాది కరోనా ఉండటం వల్ల ఇంట్లోనే యోగా చేయాల్సిందిగా మోదీ పిలుపునిచ్చారు. నిజానికి కరోనా కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫ్లామ్స్‌పై ‘యోగా’ క్లాసులు చెప్పే వారి సంఖ్య కూడా పెరిగింది. యోగా కోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో, గుంపులుగా కాకుండా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో యోగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ’ థీమ్ డిసైడ్ చేశారు.
2015 – యోగా ఫర్ హార్మోని అండ్ పీస్ : ఇది తొలి ‘ఇంటర్నేషనల్ యోగా’డే థీమ్. న్యూ ఢిల్లీలో ప్రధాని మోదీ సహా 84 దేశాలకు చెందిన ప్రతినిధులు, 35,985 మంది ప్రజలు 35 నిముషాల పాటు 21 ఆసనాలు వేశారు. అమెరికాలోని 100 నగరాల్లోనూ యోగా డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. 190 దేశాల్లోనూ యోగా డే సెలబ్రేషన్స్ జరిగాయి.
2016 – కనెక్ట్ ద యూత్ : మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ రెండో ఏడాది చంఢీఘర్‌లో జరిపిన ‘యోగా డే’లో 150 మంది డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ పర్సన్స్ పార్టిసిపేట్ చేయడం విశేషం.
2017- యోగా ఫర్ హెల్త్ : మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్.. లక్నోలో నిర్వహించిన ‘యోగా డే’లో 80 దేశాల ఫారిన్ డెలిగేట్స్ పాల్గొన్నారు.
2018- యోగా ఫర్ పీస్ : రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన యోగా డేలో లక్షకు మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ ఫీట్ గిన్నిస్ రికార్డు సాధించడం గమనార్హం.
2019- యోగా ఫర్ హార్ట్ థీమ్: యోగా ఫర్ హార్ట్ థీమ్ తో రాంచీలో నిర్వహించారు.