రానున్నది రైతులకు మంచి రోజులే :అప్పయ్య శాస్త్రి
దిశ, జనగామ: ఈ దసరా నుంచి వచ్చే దసరా వరకు వేసే ప్రతి పంటలు రైతులకు మెరుగైన దిగుబడి లభిస్తుందని జనగామ కు చెందిన బ్రాహ్మణ సంఘం ప్రధాన అర్చకులు అప్పయ్య శాస్త్రి అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గణపతి ఆలయంలో శుక్రవారం శమీ పూజను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘం ప్రధాన అర్చకులు అప్పయ్య శాస్త్రి ముఖ్య […]
దిశ, జనగామ: ఈ దసరా నుంచి వచ్చే దసరా వరకు వేసే ప్రతి పంటలు రైతులకు మెరుగైన దిగుబడి లభిస్తుందని జనగామ కు చెందిన బ్రాహ్మణ సంఘం ప్రధాన అర్చకులు అప్పయ్య శాస్త్రి అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పర్వదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గణపతి ఆలయంలో శుక్రవారం శమీ పూజను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘం ప్రధాన అర్చకులు అప్పయ్య శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రీయ పద్ధతిలో అమ్మవారికి సొరకాయను బలినిగా ఇచ్చి భక్తులకు జమ్మీ పంచిపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై ఉన్న కరోనా రోగా పీడనం ఈ దసరా తో ముగిసిందని, ప్రజలకు వ్యాపారులకు ఇక ఇబ్బందులు ఉండవని అందరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని, ఈ సంవత్సరంలో రైతులకు మంచి దిగుబడి లభిస్తుందని తెలియ జేశారు.
ప్రజలందరూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కరోనా ఉన్నా లేకున్నా మాస్క్ తప్పనిసరిగా వాడితే ఇక ఎటువంటి వైరస్ లు వచ్చినా ప్రజలకు హానీ జరగదన్నారు. ఈ కార్యక్రమం లో సంతోషిమాత ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, గణపతి ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ , మరియలా సత్తయ్య, లక్ష్మణ్, రంగ నరసింహులుతో పాటు తదితరులు పాల్గొన్నారు.