చైనీస్ స్పాన్సర్లపై నిర్ణయం తీసుకోలేదు: బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ, ఐపీఎల్‌తో భాగస్వామ్యం ఉన్న చైనా కంపెనీలను బహిష్కరించాలని పలు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. సోమవారం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ విషయంపై సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు. అసలు చైనా కంపెనీల భాగస్వామ్యంపై బీసీసీఐ ఏమనుకుంటుందో తెలుసుకుందామని కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ను సంప్రదించాయి. కానీ, వాళ్లు నేరుగా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. […]

Update: 2020-07-01 12:16 GMT

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ, ఐపీఎల్‌తో భాగస్వామ్యం ఉన్న చైనా కంపెనీలను బహిష్కరించాలని పలు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. సోమవారం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ విషయంపై సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదు. అసలు చైనా కంపెనీల భాగస్వామ్యంపై బీసీసీఐ ఏమనుకుంటుందో తెలుసుకుందామని కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్‌ను సంప్రదించాయి. కానీ, వాళ్లు నేరుగా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ‘మేం పరిష్కరించుకోవల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఐపీఎల్ నిర్వహణపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చైనా స్పాన్సర్లకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశంలో చర్చించాల్సి ఉంది. కానీ, తేదీని ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని ధూమాల్ వెల్లడించారు.

Tags:    

Similar News