యెస్ బ్యాంకు ఖాతాదారులకు ఊరట!
దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంకు ఖాతాదారులకు ఊరట ఇచ్చే వార్త వచ్చింది. సొమ్ము విత్ డ్రా చేసుకోడానికి విధించిన ఆంక్షలను మరో వారంలోగా ఎత్తివేయనున్నట్టు సమాచారం. ఈ వారం తర్వాత యెస్ బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి పరిమితి లేకుండా తమ సొమ్మును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు రానుంది. ప్రస్తుతం ఉన్న విధించిన రూ. 50 వేల విత్ డ్రాను మార్చి 15 తర్వాత ఎత్తివేయనున్నట్టు కొత్తగా నియమించబడిన యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంకు ఖాతాదారులకు ఊరట ఇచ్చే వార్త వచ్చింది. సొమ్ము విత్ డ్రా చేసుకోడానికి విధించిన ఆంక్షలను మరో వారంలోగా ఎత్తివేయనున్నట్టు సమాచారం. ఈ వారం తర్వాత యెస్ బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి పరిమితి లేకుండా తమ సొమ్మును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు రానుంది. ప్రస్తుతం ఉన్న విధించిన రూ. 50 వేల విత్ డ్రాను మార్చి 15 తర్వాత ఎత్తివేయనున్నట్టు కొత్తగా నియమించబడిన యెస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ఇదివరకు ఆర్‌బీఐ విత్ డ్రా పరిమితిని రూ. 50,000 ను నెలరోజుల వరకూ అని చెప్పినప్పటికీ తాజాగా మార్చి 15 వరకే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మార్చి 15 తర్వాత ఖాతాదారులు తమ సొమ్మును ఎంత కావాలన్నా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఏప్రిల్ 3 నుంచి యెస్ బ్యాంకు కార్యకలాపాలను పునరుద్ధరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రశాంత్ తెలిపారు. అలాగే, యెస్ బ్యాంకును ఎస్‌బీఐలో విలీనం చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ప్రశాంత్ కుమార్ ఖండించారు. భవిష్యత్తులో కూడా యెస్ బ్యాంకు స్వతంత్రంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మూలధనం సమకూర్చలేని పరిస్థితుల్లోనే విలీనం అవసరమని, ఇప్పటికైతే ఇతర బ్యాంకుల వారితో చర్చిస్తున్నట్టు..మిగిలిన వివరాలను ఈ వారాంతంలో వెల్లడించనున్నట్టు చెప్పారు. ఇక, యెస్ బ్యాంకులో సుమారు 49 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ఆమోదం తెలిపింది. ముందుగా రూ. 2,450 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ పరిణామాలతోనే సోమవారం మార్కెట్లో యెస్ బ్యాంకు షేర్లు 30 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం యెస్ బ్యాంకు షేర్ ధర రూ. 21.35 వద్ద ఉంది.
Tags: yes bank, yes bank crisis, withdrawal limit