రూ.47వేల మార్క్ ధాటిన బంగారం!
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్‌లో బంగారం శుక్రవారం ఎమ్‌సీఎక్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 742 పెరిగి రూ. 47,130కి చేరింది. అంతకుముందు సెషన్‌లో పది గ్రాములు రూ. 46,388 వద్ద ముగిసింది. శుక్రవారం సాయంత్రానికి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 46,995 వద్ద ట్రేడవగా, ఆ తర్వాత రూ.607 పెరిగింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. రానున్న మూడు రోజులు సెలవుదినాలు […]
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్‌లో బంగారం శుక్రవారం ఎమ్‌సీఎక్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 742 పెరిగి రూ. 47,130కి చేరింది. అంతకుముందు సెషన్‌లో పది గ్రాములు రూ. 46,388 వద్ద ముగిసింది. శుక్రవారం సాయంత్రానికి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 46,995 వద్ద ట్రేడవగా, ఆ తర్వాత రూ.607 పెరిగింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. రానున్న మూడు రోజులు సెలవుదినాలు కావడంతో ఇంట్రాడే ట్రేడ్ సెషన్‌లో బంగారం ధర రూ 47,300 స్థాయిలను తాకవచ్చని విశ్లేషకులు ముందే ఊహించారు. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.49,060 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర రూ.45,250గా ఉంది. వెండి కిలో ప్రస్తుతం ధర రూ.48,210గా ఉంది.