Covid-19: ‘ప్రపంచాన్ని వణికిస్తోన్న ఓమిక్రాన్.. వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం వీడండి’
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి కేసులు బయటపడ్డాయి. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని ఇప్పటికే వైద్య నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్‌పై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో B.1.1529 అనే […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి కేసులు బయటపడ్డాయి. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమని ఇప్పటికే వైద్య నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్‌పై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో B.1.1529 అనే కరోనా రకాన్ని గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్ లోని పలు ఎయిర్ లైన్స్ ఆ దేశాలకు సర్వీసులు నిలిపేశాయి. టీకాలు తీసుకోకుండా ఉదాసీనత కనబరుస్తున్నవారు తక్షణం అప్రమత్తం కావాలి. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి’ అని విజయసాయిరెడ్డి సూచించారు.