TG: ఇప్పటికైనా కోర్టులను, చట్టాలను గౌరవించు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ MP చురకలు

ఫార్ములా-ఈ కార్ రేసు(Formula E-Car Race Case)లో విచారణ ఎదుర్కొనేందుకు కేటీఆర్(KTR) ఎందుకు భయపడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు.

Update: 2025-01-07 16:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కార్ రేసు(Formula E-Car Race Case)లో విచారణ ఎదుర్కొనేందుకు కేటీఆర్(KTR) ఎందుకు భయపడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా కోర్టులను, చట్టాలను గౌరవించాలని కేటీఆర్‌కు సూచించారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు(Telangana High Court) కొట్టివేసినా మార్పు కనిపించడం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కేటీఆర్‌కు ఇకనైనా తెలిసి ఉండాలని అన్నారు. తప్పు జరిగింది కాబట్టే కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. జైలు(Jail)కు వెళ్లడానికైనా సిద్ధం అని తొడలు కొట్టడం కాదు.. ముందు విచారణకు హాజరు అవ్వు అని సూచించారు. ప్రతి దానిని రాజకీయం చేస్తూ కథలు చెబుతున్న కేటీఆర్.. ఇకనైనా డ్రామాలు బంద్ చేయాలని అన్నారు.

Tags:    

Similar News