భువనేశ్వరి అనుమతిస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలమంతా ఆమె కాళ్లు కడుగుతాం
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి అనుమతిస్తే.. వైసీపీ ఎమ్మెల్యేల మంతా కలిసి కన్నీటితో ఆమె పాదాలు కడుగుతామంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అయితే వల్లభనేని వంశీమోహన్ తమ పార్టీ ఎమ్మెల్యే కాదని.. తమకు […]
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి అనుమతిస్తే.. వైసీపీ ఎమ్మెల్యేల మంతా కలిసి కన్నీటితో ఆమె పాదాలు కడుగుతామంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
అయితే వల్లభనేని వంశీమోహన్ తమ పార్టీ ఎమ్మెల్యే కాదని.. తమకు సంబంధం లేదన్నారు. అయినా సహచర ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆ తల్లి అనుమతిస్తే మా పార్టీ ఎమ్మెల్యేలమంతా మా కన్నీటితో పాదాలు కడుగుతామని చెప్పుకొచ్చారు.
బాబే.. భార్యను క్షోభపెడుతున్నారు..
గౌరవసభ పేరుతో చంద్రబాబే ఆయన సతీమణి భువనేశ్వరిని అవమానిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు విమర్శించారు. చంద్రబాబు గౌరవ సభల పేరిట ఆమెకు తీరని అవమానం చేస్తున్నారన్నారు. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా ఆమెను ఎవరూ కించపరచలేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గౌరవానికి భంగం కలిగించేలా ఎక్కడా వ్యాఖ్యానించొద్దంటూ హితవు పలికారు.