ముగ్గురు అమ్మాయిలతో వైసీపీ నేతలు..

దిశ, ఏపీ బ్యూరో: అధికారంలో ఉన్నాం.. మనలను అడ్డుకునేదెవరు.. కొవిడ్ నిబంధనలు ఉన్నా అవి మనకు వర్తించవు.. సామాన్యులకే అనుకున్నారో ఏమో గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి… రికార్డింగ్‌ డ్యాన్స్‌లతో ఎగిరి గంతేశారు. స్టేజ్‌పై డ్యాన్సర్లతో కలిసి రఫ్పాడించేశారు. అధికార పార్టీ నేతలు కదా మనకెందుకులే అనుకున్నారో ఏమో పోలీసులు దరిదాపులో కానరాలేదు. రైతులు, వ్యాపారుల సంక్షేమం కోసం.. వారి బాగుకోసం చర్చించే వేదిక అయిన మార్కెట్ […]

Update: 2021-07-10 06:35 GMT

దిశ, ఏపీ బ్యూరో: అధికారంలో ఉన్నాం.. మనలను అడ్డుకునేదెవరు.. కొవిడ్ నిబంధనలు ఉన్నా అవి మనకు వర్తించవు.. సామాన్యులకే అనుకున్నారో ఏమో గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి… రికార్డింగ్‌ డ్యాన్స్‌లతో ఎగిరి గంతేశారు. స్టేజ్‌పై డ్యాన్సర్లతో కలిసి రఫ్పాడించేశారు. అధికార పార్టీ నేతలు కదా మనకెందుకులే అనుకున్నారో ఏమో పోలీసులు దరిదాపులో కానరాలేదు. రైతులు, వ్యాపారుల సంక్షేమం కోసం.. వారి బాగుకోసం చర్చించే వేదిక అయిన మార్కెట్ యార్డు ఈ అశ్లీల నృత్యాలకు వేదిక కావడం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి క్రోసూరు మండల వైసీపీ నేత షేక్‌ గనీ జన్మదినం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు. మందు, విందుతోపాటు రికార్డింగ్ డ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్‌లో వైసీపీ నేతలు తమ కళను బయటపెట్టారు. స్టేజ్‌పై ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుండగా వారి మధ్యలో వైసీపీ నేతలు దూరారు. వారిని టచ్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. డ్యాన్సర్లతో ఆడిపాడుతూ ఓ నేత నానా హంగామా చేశారు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు అమ్మాయిలను ఎత్తుకొని రచ్చ రంబోలా చేశారు. తమ నేతలు డ్యాన్సర్లను ఎత్తుకుని స్టేజ్‌పై హంగామా చేస్తుంటే స్టేజ్‌కింద ఉన్న నేతలు విజిల్స్ మోతలు మోగించారు. కొందరైతే డ్యాన్సర్లకు పోటీగా స్టెప్పులేశారు. ఒకరు నిలుచుని స్టెప్పులేస్తే మరికొందరు పడుకుని స్టెప్పులు వేశారు.

వైసీపీ నేతల స్టెప్పులకు స్టెప్పులు వేయలేక డ్యాన్సర్లు ఒకానొక దశలో అసహనం చెందారు. ఇకపోతే డ్యాన్స్ వేడుకలు అర్థరాత్రి దాటిన తర్వాత శృతిమించాయి. అశ్లీల నృత్యాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రైతుల సమస్యలకోసం.. వారిని ఆదుకునేందుకు వేదిక కావాల్సిన మార్కెట్ యార్డు ఇలా రికార్డింగ్ డ్యాన్స్‌లకు వేదికవ్వడంతో పలువురు విమర్శిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను గాలికొదిలేసి ఇలా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రికార్డింగ్‌ డ్యాన్స్‌పై లోకేశ్ ఆగ్రహం

వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్స్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయి ఉసూరుమంటుంటే, వ్యవసాయ సంక్షోభంలో రైతాంగం కూరుకుపోయి నానా కష్టాలు పడుతుంటే రికార్డింగ్‌ డ్యాన్సుల్లో వైసీపీ నేతలు మునిగిపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడుతుంటేప‌ట్టించుకోని అధికార పార్టీ వైసీపీ నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డింగ్ డాన్సులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల్ని ఏడిపిస్తూ, రైతు దినోత్సవం పేరిట ఇలాంటి అస‌భ్య కార్యక్రమమా? అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు

Tags:    

Similar News