బండి సంజయ్ అభిమాని పరిస్థితి విషమం
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ గతకొన్ని రోజుల క్రితం బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉందని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా శ్రీనివాస్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడెం. అయితే ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ గతకొన్ని రోజుల క్రితం బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉందని యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా శ్రీనివాస్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడెం. అయితే ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు శ్రీనివాస్‌ను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.