లోక కల్యాణార్థం యజ్ఞం

దిశ, వరంగల్: లోక కల్యాణార్థం ములుగు రోడ్‌లోని వాసవి కన్యకా మాత ఆలయంలో ఆదివారం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణలోకి రావాలని, నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హోమం నిర్వహించామని తెలిపారు. ఇందులో ‘గాడ్ ఆఫ్ మెడిసిన్’గా కీర్తించే వైద్యులు ధన్వంతరికి ప్రత్యేక పూజలతోపాటు గణపతి, నవగ్రహ, చండీ, దుర్గ హోమాలు చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ, సెక్రటరీ […]

Update: 2020-03-29 07:49 GMT

దిశ, వరంగల్: లోక కల్యాణార్థం ములుగు రోడ్‌లోని వాసవి కన్యకా మాత ఆలయంలో ఆదివారం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణలోకి రావాలని, నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హోమం నిర్వహించామని తెలిపారు. ఇందులో ‘గాడ్ ఆఫ్ మెడిసిన్’గా కీర్తించే వైద్యులు ధన్వంతరికి ప్రత్యేక పూజలతోపాటు గణపతి, నవగ్రహ, చండీ, దుర్గ హోమాలు చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ, సెక్రటరీ అంచురి శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: mulugu, yajna, mayor gunda prakash rao, kanyaka matha temple, dhanwantari

Tags:    

Similar News