బైబై.. యాహు గ్రూప్స్

దిశ, వెబ్ డెస్క్: గూగుల్, జీమెయిల్ రాకముందు..‘యాహు’ప్రభంజనమే ఉండేది. 90వ దశకంలో స్నేహితులను కనెక్ట్ చేసి, వారిని దగ్గర చేసింది యాహు. ఆన్‌లైన్ మ్యాపింగ్, వీడియో షేరింగ్, ఫాంటసీ స్పోర్ట్స్, మెయిల్, న్యూస్, ఫైనాన్స్ ఇలా పలు సర్వీస్‌లు అందిస్తున్న యాహు.. తన మెసెంజర్ సర్వీస్‌లకు 2018లో బైబై చెప్పేసింది. ఇక డిసెంబర్ 15 నుంచి యాహు గ్రూప్స్‌‌ను కూడా నిలిపివేయనుంది. యాహు గ్రూప్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు తన సేవలను అందించింది. ‘గ్రూపు ఇంటరాక్షన్’ […]

Update: 2020-10-16 04:43 GMT

దిశ, వెబ్ డెస్క్: గూగుల్, జీమెయిల్ రాకముందు..‘యాహు’ప్రభంజనమే ఉండేది. 90వ దశకంలో స్నేహితులను కనెక్ట్ చేసి, వారిని దగ్గర చేసింది యాహు. ఆన్‌లైన్ మ్యాపింగ్, వీడియో షేరింగ్, ఫాంటసీ స్పోర్ట్స్, మెయిల్, న్యూస్, ఫైనాన్స్ ఇలా పలు సర్వీస్‌లు అందిస్తున్న యాహు.. తన మెసెంజర్ సర్వీస్‌లకు 2018లో బైబై చెప్పేసింది. ఇక డిసెంబర్ 15 నుంచి యాహు గ్రూప్స్‌‌ను కూడా నిలిపివేయనుంది.

యాహు గ్రూప్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు తన సేవలను అందించింది. ‘గ్రూపు ఇంటరాక్షన్’ ప్లాట్‌ఫామ్‌లో యాహు గ్రూప్స్ ఇంటర్నెట్ మొదటి తరానికి ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అయితే, యాహు ఇక తమ గ్రూప్ సర్వీసులను నిలిపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘కస్టమర్లు ప్రీమియం, ట్రస్టీ కంటెంట్‌ను కోరుకుంటున్నారు. అయితే, మా దీర్ఘకాలిక వ్యూహానికి సరిపోని ప్రొడక్ట్స్ విషయంలో కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలోని ఇతర రంగాలపై దృష్టి పెట్టడానికి యాహు గ్రూప్ సర్వీస్‌లను నిలిపేస్తున్నాం. 20 ఏండ్లలో డిజిటిల్ కమ్యూనిటిస్‌లో భాగంగా కౌంటెలెస్ కనెక్షన్స్ అందించాం. దానికి మీరు అందించిన సపోర్ట్ ప్రధాన కారణం. అందుకు మీ అందరకీ కృతజ్ఞతలు’అని కంపెనీ తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది.

అక్టోబర్ 12 నుంచి యాహు గ్రూప్స్‌లో కొత్త గ్రూపులు క్రియేట్ చేసుకునే అవకాశాన్ని యాహు నిలిపేసింది. డిసెంబర్ 15 నుంచి యాహు గ్రూప్స్ నుంచి సెండింగ్ , రిసీవింగ్ మెయిల్స్ సర్వీసులు ఉండవని యాహు ప్రకటించింది. ఫేస్‌బుక్ గ్రూప్స్, గూగుల్ గ్రూప్స్, గ్రూప్స్.ఐవోలలో జాయిన్ అయితే, పెయిడ్ ఫంక్షన్ ఆధారంగా యాహు గ్రూప్స్ మెంబర్స్‌ను ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని యాహు తన ప్రకటనలో పేర్కొంది. ‘ఎర్లీ బర్డ్ ఆఫ్ ఇంటర్నెట్..చరిత్రలో కలిసిపోతోంది’, ‘చాలా బాధకరం. యాహు గ్రూపుల ద్వారా నేను కోల్పోయిన నా స్కూల్, కాలేజ్ స్నేహితులను ఒక్కటిగా చేయగలిగాను’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News