ఐఐఎంకు అర్హత సాధించిన యాదాద్రి యువకుడు
దిశ, న్యూస్ బ్యూరో : అహ్మదాబాద్ ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ఫిబ్రవరిలో నిర్వహించిన మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన వరకాంతం జంగారెడ్డి, పుష్ప దంపతుల కుమారుడు హేమంత్ రెడ్డి 99.13 శాతం మార్కులతో ఐఐఎం అహ్మదాబాద్‌లో 2020- 22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధించాడు. ప్రస్తుతం వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌లో నివసించే హేమంత్ హైస్కూల్ స్థాయి నుంచి […]
దిశ, న్యూస్ బ్యూరో :
అహ్మదాబాద్ ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ఫిబ్రవరిలో నిర్వహించిన మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన వరకాంతం జంగారెడ్డి, పుష్ప దంపతుల కుమారుడు హేమంత్ రెడ్డి 99.13 శాతం మార్కులతో ఐఐఎం అహ్మదాబాద్‌లో 2020- 22 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధించాడు. ప్రస్తుతం వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌లో నివసించే హేమంత్ హైస్కూల్ స్థాయి నుంచి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఏడాదికాలం పాటు టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే క్యాట్ పరీక్ష సన్నద్ధమై ఐఐఎం అహ్మదాబాద్‌లో అర్హత సాధించాడు.
Tags: Ahmedabad, IIM, Yadadri, Hemanth, Interview, topper