గుడుంబా రహిత జిల్లాగా కొనసాగించండి
దిశ, భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా కొనసాగించాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్ ఆర్కియాలజీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భువన గిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ….అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కింద తాటి, ఈత వనాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నీరా పాలసీ కింద తాటి చెట్లను, […]
దిశ, భువనగిరి : యాదాద్రి-భువనగిరి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా కొనసాగించాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్ ఆర్కియాలజీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భువన గిరి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ….అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కింద తాటి, ఈత వనాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నీరా పాలసీ కింద తాటి చెట్లను, తాటి ఉత్పత్తులను పూర్తిస్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గీత కార్మికుల సొసైటీలకు అందించిన భూమిని తాటి, ఈత వనాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గంజాయి రవాణా జరగకుండా జిల్లా మీదుగా నడిచే రైళ్లల్లో కూడా తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం భువనగిరి ఖిల్లాను ఆయన సదర్శించి పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. ఖిల్లాపై ఏర్పాటు చేసిన రాక్ క్లైంబింగ్ కేంద్రాన్నిపరిశీలించారు