టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన క్రెజికోవా, సిట్సిపాస్
దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్ గెలిచిన చెక్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. మహిళల సింగిల్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నది. ఇక ఫైనల్‌లో ఓడిపోయిన పవ్లీచెంకోవా 13 స్థానాలు మెరుగు పరుచుకొని 19వ ర్యాంకుకు చేరుకున్నది. సెమీస్‌లో ఓడిన స్లోవేనియాకు చెందిన తమార జిదాన్‌సెక్ 38 స్థానాలు మెరుగుపర్చుకొని తొలి సారిగా టాప్ 50లోకి చేరింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ టాప్ […]
దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్ గెలిచిన చెక్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. మహిళల సింగిల్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నది. ఇక ఫైనల్‌లో ఓడిపోయిన పవ్లీచెంకోవా 13 స్థానాలు మెరుగు పరుచుకొని 19వ ర్యాంకుకు చేరుకున్నది. సెమీస్‌లో ఓడిన స్లోవేనియాకు చెందిన తమార జిదాన్‌సెక్ 38 స్థానాలు మెరుగుపర్చుకొని తొలి సారిగా టాప్ 50లోకి చేరింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్టీ టాప్ ర్యాంకులో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో నయోమీ ఒసాక ఉన్నది. పురుషుల ర్యాంకింగ్స్ (ఏటీపీ)లో ఫైనలిస్ట్ స్టెఫానో సిట్సిపాస్ ఒక స్థానం మెరుగు పరుచుకొని 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. నోవాక్ జకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
డబ్ల్యూటీఏ ర్యాంకులు
1. ఆష్లే బార్టీ
2. నయోమీ ఒసాక
3. సిమోన హెలెప్
4. అరినా సబలెంక
5. సోఫియా కెనిన్
6. ఎలీనా స్వితొలినా
7. బినాక ఆండ్రెస్కూ
8. సెరేనా విలియమ్స్
9. ఇగ ష్వామ్‌టెక్
10. కరోలినా ప్లిస్కోవా
ఏటీపీ ర్యాంకులు
1. నోవాక్ జకోవిచ్
2. డానిల్ మెద్వెదేవ్
3. రఫెల్ నదాల్
4. స్టెఫానో సిట్సిపాస్
5. డోమినిక్ థీమ్
6. అలెగ్జాండర్ జ్వెరెవ్
7. ఆండ్రీ రూబ్లెవ్
8. రోజర్ ఫెదరర్
9. మాటియో బెరెట్టిని
10. రోబర్టో బటిస్టా