నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు, ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనలు అనుసరించి భౌతికదూరం పాటించేలా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడూ శానిటైజేషన్ చేయడంతో పాటు, భక్తులు అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న మూలంగా లాక్‌డౌన్ విధించడంతో, […]

Update: 2020-10-03 21:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు, ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనలు అనుసరించి భౌతికదూరం పాటించేలా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడూ శానిటైజేషన్ చేయడంతో పాటు, భక్తులు అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న మూలంగా లాక్‌డౌన్ విధించడంతో, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు బంద్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News