ఆ మాస్క్ ఖరీదు రూ.11 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నుంచి తప్పించుకోవాలంటే, మాస్క్ మస్ట్ అన్నది జగమెరిగిన సత్యం. అందుకే మార్కెట్‌లో ‘మాస్క్’లకు ఓ పెద్ద మార్కెట్ ఏర్పడింది. అటు డిజైనర్లు కూడా మ్యాచింగ్ మాస్క్‌లు, డిజైనర్ మాస్క్‌లను రూపొందిస్తూ బిజినెస్‌ను పెంచుకుంటున్నారు. కొందరు మాత్రం అందరికంటే భిన్నంగా బంగారపు మెరుపులద్దడంతో పాటు వజ్రాలు పొదిగిన ఖరీదైన మాస్క్‌లను తయారు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌కు చెందిన వైవెల్ అనే జువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్క్ రూపొందించింది. వైవెల్ […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నుంచి తప్పించుకోవాలంటే, మాస్క్ మస్ట్ అన్నది జగమెరిగిన సత్యం. అందుకే మార్కెట్‌లో ‘మాస్క్’లకు ఓ పెద్ద మార్కెట్ ఏర్పడింది. అటు డిజైనర్లు కూడా మ్యాచింగ్ మాస్క్‌లు, డిజైనర్ మాస్క్‌లను రూపొందిస్తూ బిజినెస్‌ను పెంచుకుంటున్నారు. కొందరు మాత్రం అందరికంటే భిన్నంగా బంగారపు మెరుపులద్దడంతో పాటు వజ్రాలు పొదిగిన ఖరీదైన మాస్క్‌లను తయారు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌కు చెందిన వైవెల్ అనే జువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్క్ రూపొందించింది.
వైవెల్ రూపొందించిన ఈ మాస్క్ 250 గ్రాముల బరువుండగా, దాన్ని ప్యూర్ 18కె బంగారంతో తయారుచేశారు. ఆ మాస్క్‌ను 3,608 బ్లాక్ అండ్ వైట్ డైమండ్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఆ వజ్రాల బరువే 210 కారెట్స్ ఉంది. దీన్ని తయారు చేయడానికి ఆ జువెలరీ సంస్థ దాదాపు నాలుగు నెలల కష్టపడింది. వజ్రాలు పొదిగి, బంగారంతో రూపొందించిన ఈ మాస్క్ ధర 2.17 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు( రూ. 11,16,87,750). అంతేకాదు ఈ మాస్క్‌కు హయ్యెస్ట్ ఫిల్టరేషన్ అందించే ఎన్ 99 వోల్వ్‌ను కూడా అమర్చారు. కాగా లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఈ మాస్క్‌ను ఆర్డర్ ఇచ్చినట్లు వైవెల్ కంపెనీ తెలిపింది. ఇజ్రాయెల్ ఇండస్ట్రీని ఆదుకోవడంతో పాటు వైవెల్ జువెలరీలో పనిచేసే దాదాపు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడకుండా ఉండేందుకు ఈ ఆర్డర్ చేశారని వైవెల్ తెలిపింది. ఈ మాస్క్ కోసం దాదాపు 25 మంది వర్కర్స్ పనిచేశారు.
కరోనా ప్రారంభమైన తర్వాత చాలా మంది బంగారు, వజ్రాలు పొదిగిన ఖరీదైన మాస్క్‌లను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న సందర్భాలున్నాయి. యూఏఈకి చెందిన ప్రముఖ జువెలరీ కంపెనీ జాకోబ్ అండ్ కంపెనీ కూడా 18కె వైట్ గోల్డ్‌తో ఓ మాస్క్ తయారు చేసింది. దీంట్లో 3040 వైట్ డైమండ్స్‌ను అమర్చారు. దీని ధర కోటి 86 లక్షలు రూపాయలు కాగా, న్యూయార్క్‌కు చెందిన క్రిస్టియన్ సిరియానో రూపొందించిన బ్లాక్ క్రిస్టల్ మాస్క్, ఇటలీ కంపెనీ బిజన్ తయారుచేసిన ప్యూర్ సిల్క్ ఫేస్ మాస్క్‌లు కూడా ఖరీదైనవే. మనదేశంలోనూ కొందరు బంగారు మాస్క్‌లు తయారు చేయించుకోవడం విశేషం.