వరల్డ్ రికార్డ్.. కరోనా రోగికి ఫస్ట్ టైం లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్.. వారి త్యాగం ఊరికేపోలేదు!

దిశ, వెబ్‌డెస్క్ : ‘కరోనా’ ఈ పేరు వింటే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచంలో తామే ది బెస్ట్ అని విర్రవీగే దేశాలకు సైతం కరోనా ముచ్చెమలు పట్టించింది. ఎప్పుడు ఆస్పత్రి మెట్లు ఎక్కని వారిని సైతం క్యూ లైన్లో నిలబెట్టింది. దీని దెబ్బకు అగ్రరాజ్యాలతో పాటు మమూలు దేశాలు సైతం తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరోసారి ప్రపంచ దేశాలకు పెను సవాల్ విసురుతోంది. కరోనా ధాటికి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ […]

Update: 2021-04-10 03:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘కరోనా’ ఈ పేరు వింటే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచంలో తామే ది బెస్ట్ అని విర్రవీగే దేశాలకు సైతం కరోనా ముచ్చెమలు పట్టించింది. ఎప్పుడు ఆస్పత్రి మెట్లు ఎక్కని వారిని సైతం క్యూ లైన్లో నిలబెట్టింది. దీని దెబ్బకు అగ్రరాజ్యాలతో పాటు మమూలు దేశాలు సైతం తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరోసారి ప్రపంచ దేశాలకు పెను సవాల్ విసురుతోంది. కరోనా ధాటికి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ కోలుకోకపోగా, మరోసారి జనజీవనం స్తంభించిపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

అయితే, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వివిధ దేశాలు తమకు తోచిన విధంగా చర్యలు చేపడుతున్నాయి. కొందరు లాక్‌డౌన్ విధిస్తుండగా, మరికొందరు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కరోనా మరణాలు సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది కరోనా సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కరోనా పాండమిక్‌ సిచువేషన్‌లోనూ జపాన్‌ దేశం సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్‌ను చేసింది.

జపాన్‌కు చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అక్కడి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి ఆర్గాన్స్ సేకరించి డజన్‌కు పైగా సర్జరీలు చేశారు. దాంతో ఆమె రెండున్నర ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించింది. ఇటీవల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. మరోసారి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంట్ చేయడం తప్ప మరోమార్గం లేదని చెప్పారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోతే ఇంక ఆశలు వదులుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఆమె భర్త, కొడుకు ఊపిరితిత్తులు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సుమారు 11గంటల పాటు శ్రమించిన క్యోటో యూనివర్శిటీ వైద్యులు భర్త ఎడమ లంగ్, కొడుకు కుడి లంగ్ నుంచి కొంత భాగాన్ని తీసి ఆ మహిళకు అమర్చారు. అనంతరం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం స్టెబుల్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ సర్జరీతో ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా రోగికి ఊపిరితిత్తులు విజయవంతగా ట్రాన్స్ ప్లాంట్ చేసిన దేశంగా జపాన్ వైద్యులు రికార్డు సృష్టించారు.

Tags:    

Similar News