ఉద్యోగులకు ట్విట్టర్‌ మరోసారి ఝలక్.. చివరికి బ్లూటిక్ ఇన్ఛార్జ్‌‌కు కూడా తప్పని లే ఆఫ్ వేటు!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ తన సంస్థ ఉద్యోగులకు మరోసారి ఝలక్ ఇచ్చింది.

Update: 2023-02-27 07:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ తన సంస్థ ఉద్యోగులకు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే భారీగా ఉద్యోగులను తొలగించిన సంస్థ.. తాజాగా సుమారు 200 మందికి లేఆఫ్స్‌ ప్రకటించింది. ఇది ట్విట్టర్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. ఈసారి ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్‌పై పనిచేసే ఇంజినీర్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగం నుంచి తమను తొలగించినట్టు ఈమెయిల్స్ వచ్చాయని కొందరు తెలిపారు. ఇంటర్నల్ సిస్టమ్‌లోకి లాగిన్ కాలేకపోయామని.. దీంతో తమను తొలగించారనే విషయాన్ని అర్థం చేసుకున్నామని మరికొందరు ఉద్యోగులు తెలిపారు.

తాజా లేఆఫ్స్‌లో కొన్ని డజన్ల మందిని తొలగించినట్టు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్‌పై స్పందించాలన్న బ్లూంబర్గ్ కామెంట్‌కు ట్విట్టర్ స్పందించలేదు. తాజా లేఆఫ్‌లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్న ఎస్తర్ క్రాఫోర్డ్ కూడా ఉన్నారు. ఆయన సబ్ స్క్రిప్షన్ సర్వీస్ బ్లూటిక్ ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు. కాగా, గతేడాది టెస్లా అధినేత ఎలన్‌మస్క్ ట్విట్టర్‌ను టేకోవ‌ర్ చేసిన వెంట‌నే ఉన్నతాధికారుల‌పై వేటు వేసి పెద్దసంఖ్యలో ఉద్యోగుల‌ను తొల‌గించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News