Trump : అధ్యక్షుడినైతే రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా : ట్రంప్

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-07-20 19:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడి తాను ఈమేరకు భరోసా ఇచ్చానని ట్రంప్ వెల్లడించారు. ఈమేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో ఓ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే 2025 సంవత్సరం జనవరి 20న ప్రమాణస్వీకారానికి ముందే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ఆయన చెప్పారు.

జెలెన్‌స్కీతో ఫోన్ సంభాషణ బాగా జరిగిందని ట్రంప్ తెలిపారు. తాను 2022లో అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. అసలు ఈ యుద్ధం మొదలయ్యేది కాదన్నారు. చర్చల ద్వారా యుద్ధాలను ముగించి, శాంతిని నెలకొల్పుతానని ట్రంప్ చెప్పారు. ఇక ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. రిపబ్లికన్ అభ్యర్ధిగా నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలుపుతూ జెలెన్‌స్కీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.

Tags:    

Similar News