కిర్గిజ్‌స్థాన్‌లో బంధీలుగా తెలుగు విద్యార్థులు.. దాడులకు కారణం ఇదే..!

విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వాళ్లకు గుర్తుకు వచ్చే దేశాల్లో కిర్గిజిస్తాన్‌ ఒకటి.

Update: 2024-05-18 12:50 GMT

దిశ వెబ్ డెస్క్: విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వాళ్లకు గుర్తుకు వచ్చే దేశాల్లో కిర్గిజ్‌స్థాన్‌ ఒకటి. ముఖ్యంగా వైద్యరంగంపై ఆశక్తి ఉన్న విద్యార్థులను ఆకర్షిస్తోంది. కిర్గిజ్‌స్థాన్‌లో పేరుగాంచిన వైద్య విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉండంతో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి విద్యార్థులు కిర్గిజ్‌స్థాన్‌కి వెళ్తుంటారు. వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఏప్రిల్ 2023 డేటా ప్రకారం.. దాదాపు 9,500 మంది విదేశి విద్యార్థులు కిర్గిజ్‌స్థాన్‌లో విద్యనభ్యసిస్తున్నారు.

కాగా ఈ నెల 13వ తేదిన కిర్గిజ్ విద్యార్థులకు ఈజిప్టు విద్యార్థులకు మద్య ఘర్షణ జరింగింది. కాగా ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో జనసమూహం ఎక్కువగా ఉండే బిష్‌కెక్‌‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన హాస్టల్స్‌ని లక్ష్యంగా చేసుకుని అల్లరిమూఖలు దాడులకు పాల్పడుతున్నారు.

అయితే దాడులు జరుగుతున్న బిష్‌కెక్‌‌లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దీనితొ తమ పిల్లలపైన దాడులు చేస్తామని అల్లరిమూఖలు హెచ్చరిస్తున్నాయని, ఎలాగైన తమ పిల్లల్ని భారత్‌కు తీసుకురావాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై కేంద్రం స్పందించింది. ఇల్ల నుండి బయటకు రావొద్దని విద్యార్థులకు సూచించింది. ఏదైనా సమస్య ఉంటే భారత రాయబారకార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా పేర్కొంది.


Similar News