మరియాపోల్‌లో పుతిన్ ఆకస్మిక పర్యటన
ఓ వైపు ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మిక పర్యటన చేశారు.
కీవ్: ఓ వైపు ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మిక పర్యటన చేశారు. తాజాగా రష్యా అక్రమిత భూభాగమంగా పేర్కొంటున్న మరియాపోల్‌లో ఆయన పర్యటించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా కథనాలు ఆదివారం వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కాస్తా వైరల్‌గా మారాయి. ఉక్రెయిన్‌తో రష్యా ప్రత్యేక అపరేషన్ ప్రారంభించిన తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించడం ఇదే మొదటి సారి. అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజుల్లోనే ఈ యాత్ర చోటు చేసుకోవడం గమనార్హం.
మరియాపోల్‌కు హెలికాప్టర్లో చేరుకున్న పుతిన్ పలు ప్రాంతాల్లో తిరగడమే కాకుండా స్థానిక ప్రజలతో నేరుగా ముచ్చటించారు. రష్యా ప్రత్యేక అపరేషన్‌తో ఈ నగరం తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలో నగరాన్ని తిరిగి నిర్మించేందుకు గానూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పెనిసులాను రష్యాలో అంతర్భాగమని ప్రకటించి 9 ఏళ్ల కావొస్తున్న నేపథ్యంలో పుతిన్ పర్యటన సాగింది.