ఆ పార్టీలో అలా బట్టలు లేకుండా ఫొటోలు..Finland PM Sanna Marin
ఫిన్నిష్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలో.. PM of Finland, issued an apology on a contentious photograph.
దిశ, వెబ్‌డెస్క్ః గత వారం, ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ అధికారిక నివాసంలో డ్యాన్స్ చేస్తూ, తన స్నేహితులు, ప్రముఖుల బృందంతో సరదాగా పార్టీ చేసుకున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వార్తలకు కారణమయ్యింది. అలాగే, 36 ఏళ్ల మారిన్ చేస్తుకున్న పార్టీ వీడియో ఆ దేశంలో వివాదాన్ని రేకెత్తించింది. ఇది జరిగిన వారంలోపే, తన ఇంటి దగ్గర చిత్రీకరించిన ఓ వివాదాస్పద ఫోటోపై మంగళవారం ఆమె క్షమాపణలు చెప్పారు. ఫిన్నిష్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలో ఇద్దరు మహిళలు తమ టాప్‌లు పైకి లేపి, ముద్దులు పెట్టుకోవడం, "ఫిన్‌లాండ్" అనే పదంతో వారి వక్షోజాలను కప్పి ఉంచడం కనిపిస్తుంది.
జులై 8 నుంచి 10వ తేదీ వరకు జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌ల్లో పాల్గొన్న తర్వాత తన స్నేహితులతో కేసరంతలోని ప్రధాని అధికారిక నివాసంలో తీసిన ఫొటో ఇది అని ఆమె మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హెల్సింకిలో విలేఖరులతో మాట్లాడుతూ, "ఈ ఫొటో సమర్ధించదగినది కాదని నేను భావిస్తున్నాను. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. అలాంటి ఫొటోను తీసుండకూడదు" అని మారిన్ అన్నారు.
స్నాప్‌లో ఉన్న మాజీ మిస్ ఫిన్లాండ్ పోటీదారు, ఆమెతో పాటు ఉన్న మరో సోషల్ మీడియా స్టార్ మొదట్లో ఈ చిత్రాన్ని వారి టిక్‌టాక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో, ప్రధాని మారిన్ వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, నార్డిక్ ప్రాంతంలోని అతిపెద్ద వార్తాపత్రిక అయిన హెల్సింగిన్ సనోమాట్, ప్రధాని సన్నా మారిన్ "నియంత్రణ"లో ఉన్నట్లు కనిపించడం లేదని, ఆమె వ్యక్తిగత జీవితంలోని మరిన్ని ఫొటోలు, వీడియోలు పబ్లిక్ డొమైన్‌లోకి వస్తాయని పేర్కొంటూ మంగళవారం ఓ సంపాదకీయాన్ని ప్రచురించింది.