బంగ్లాదేశ్ పార్లమెంటును రద్దు చేసిన ప్రెసిడెంట్

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిన్న తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోగా, నేడు ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు ప్రెసిడెంట్.

Update: 2024-08-06 10:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిన్న తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోగా, నేడు ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు ప్రెసిడెంట్. రిజర్వేషన్ల కోసం మొదలైన నిరసనలు ఏకంగా దేశాన్నే సంక్షోభంలో పడేశాయి. ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టిన నిరసనకారులు దేశాన్ని హింసాత్మకంగా మార్చడంతో ప్రధాని దేశం విడిచి వెళ్ళగా.. నేడు పార్లమెంటు రద్దు చేయాలని నిరసనకారులు ఆందోళనలు మొదలు పెట్టడంతో ప్రెసిడెంట్ మహ్మద్ షహాబుద్దీన్ ఈ నిర్ణయం తీసుకునట్టు ప్రెసిడెంట్ సెక్రెటరీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళగానే రాజకీయ పరిస్థితులు వెంట వెంటనే మారిపోయాయి. దేశ అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకోగా, ఆ వెంటనే మాజీ ప్రధాని, షేక్ హశీనాకు రాజకీయాల్లో బద్ద శత్రువైన ఖలీదా జియాను విడుదల చేయాలంటూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో ఓ కుంభకోణంలో ఖలీదా అరెస్టయ్యారు. కాగా మంగళవారం సాయంత్రం బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.      


Similar News