Pope Francis: ట్రంప్,హారిస్‌ ఇద్దరూ చెడ్డవారే.. పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-14 19:30 GMT

దిశ, వెబ్‌డెస్క్:అగ్రరాజ్యం అమెరికా(America)లో ఈ ఏడాది నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్(Republican) పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్(Democratic) పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris)ల మధ్య ఫైట్ నువ్వానేనా అన్నట్లుగా కొనసాగుతుంది.ఈ ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ దూసుకెళ్తున్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్, హారిస్‌లపై క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) తీవ్రమైన విమర్శలు చేశారు. ట్రంప్ వలస వ్యతిరేక విధానాలకు ,హారిస్ అబార్షన్ హక్కులకు మద్దతు ఇవ్వడాన్ని పోప్ తప్పుబట్టారు.12 రోజుల ఆసియా(Asia) పర్యటన ముగించుకొని రోమ్‌(Rome)కు తిరిగి వస్తున్నక్రమంలో తన విమానంలో ఉన్న విలేకరులతో పోప్ మాట్లాడుతూ..'వారిద్దరూ జీవితానికి వ్యతిరేకం,ట్రంప్ వలసదారులను విస్మరిస్తే.. హారిస్ చిన్నపిల్లలను చంపాలని చెబుతున్నారని' పోప్ మండిపడ్డారు. నేను అమెరికన్ కాదు. నేను అక్కడ ఓటు వేయను. కానీ ఒకటి మాత్రం వాస్తవం.వారిద్దరూ చేసేది పాపమే.అమెరికా ప్రజలు రెండు చెడ్డ హామీలలో తక్కువ చెడు స్థాయి ఉన్న హామీని ఎంచుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షి ప్రకారం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అమెరికన్ ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.  


Similar News