తోషాఖానా బహుమతులను వేలం వేస్తాం : పాక్ ప్రధాని

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జైలుశిక్షకు దారితీసిన ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులపై కీలక నిర్ణయం వెలువడింది.

Update: 2023-08-09 11:33 GMT

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జైలుశిక్షకు దారితీసిన ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులపై కీలక నిర్ణయం వెలువడింది. ఆ గిఫ్ట్‌లను వేలం వేస్తామని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. వాటిని వేలం వేయగా వచ్చే నిధులను పేదలు, నిస్సహాయులు, అనాధాశ్రమాల కోసం వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్నికల తర్వాత రాబోయే కొత్త ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని షెహబాజ్‌ చెప్పారు.

కానీ తమ సంకీర్ణ ప్రభుత్వంలోని కొన్ని పార్టీలు దీన్ని అర్థం చేసుకోవడం లేదని కామెంట్ చేశారు. తోషాఖానాలోని బహుమతులను చౌకగా కొనేశారనే అభియోగాలతో ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.


Similar News