పాకిస్థాన్ ఐఎస్ఐ మాజీ చీఫ్ అరెస్ట్!

పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ను ఆ దేశ సైన్యం అరెస్టు చేసింది.

Update: 2024-08-12 15:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ను ఆ దేశ సైన్యం అరెస్టు చేసింది. హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. పాక్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్టు సైన్యం తెలిపింది. 'టాప్ సిటీ కేసుగా పేరుపొందిన హౌసింగ్ కుంభకోణంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు సమగ్ర దర్యాప్తు జరిపేందుకే అరెస్టు చేశామని, సైనిక చట్టంలోని నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని' ఐఎస్ఐ విభాగం పేర్కొంది. కాగా పాక్ ఐఎస్ఐ చీఫ్ గా హమీద్ 2019 నుండి 2021 వరకు పని చేశారు. అంతకముందు సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ గా పని చేసి రిటైర్ అయ్యారు. హౌసింగ్ స్కీంలో అక్రమాలు జరిగినట్టు బయటకు రావడం.. ఇందులో హమీద్ మీద ఆరోపణలు వెల్లడి కావడంతో గత ఏప్రిల్ లో పాక్ సైన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 


Similar News