Paetongtarn Shinawatra: థాయ్‌లాండ్‌ ప్రధానిగా షినవత్రా.. దేశ చరిత్రలో రెండో మహిళా పీఎంగా రికార్డు

థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రిగా పీటోంగ్‌టార్న్ షినవత్రా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ పార్లమెంట్‌లో ఓటింగ్ జరగగా.. 493 మంది ఎంపీలకు గాను షినవత్రాకు అనుకూలంగా 319 ఓట్లు రాగా

Update: 2024-08-16 11:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రిగా పీటోంగ్‌టార్న్ షినవత్రా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆ దేశ పార్లమెంట్‌లో ఓటింగ్ జరగగా.. 493 మంది ఎంపీలకు గాను షినవత్రాకు అనుకూలంగా 319 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 145 ఓట్లు వచ్చాయి. మరో 27 మంది ఎంపీలు ఓటు వేయలేదు. దీంతో షినవత్రా పీఎంగా ఎన్నికైనట్టు పార్లమెంట్ ప్రకటించింది. కాగా, షినవత్రే మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కావడం గమనార్హం. షినవత్రా థాయ్‌లాండ్ చరిత్రలో అతి పిన్న వయసురాలైన ప్రధానిగా, దేశంలో రెండో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. గతంలో పైటోంగ్‌టార్న్ 2023 నుంచి ఫ్యూ థాయ్ పార్టీకి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అంతేగాక గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. కాగా, మాజీ ప్రధాని స్రెత్తా తవిసిన్‌ను న్యాయస్థానం పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేర చరిత్ర ఉన్న న్యాయవాదిని మంత్రివర్గంలో చేర్చుకోగా.. ఈ చర్య నైతికత ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టు దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే షినవత్రా నూతన పీఎంగా ఎంపికయ్యారు. 

Tags:    

Similar News