నౌకలో అగ్నిప్రమాదం.. 3000 కార్లు దగ్ధం..?

దాదాపు 3వేల కార్లతో బయలుదేరిన నెదర్లాండ్స్‌కు చెందిన సరుకు రవాణా నౌక (ఫ్రెమాంటిల్‌)లో అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2023-07-26 14:01 GMT

ది హేగ్‌ : దాదాపు 3వేల కార్లతో బయలుదేరిన నెదర్లాండ్స్‌కు చెందిన సరుకు రవాణా నౌక (ఫ్రెమాంటిల్‌)లో అగ్ని ప్రమాదం జరిగింది. అమేలాండ్‌ ద్వీపం సమీపంలోని అట్లాంటిక్‌ సముద్రం మీదుగా నౌక వెళ్తుండగా అందులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు నౌక నుంచి సముద్రంలోకి దూకారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నౌకలోని కార్లన్నీ దగ్ధమయ్యాయనే వార్తలు వస్తున్నాయి.

జర్మనీలోని బ్రెమెన్‌ పోర్టు నుంచి ఈజిప్టులోని ఓ పోర్టుకు ఈ నౌక బయలుదేరిందని తెలిసింది. నౌకలో ఉన్న ఒక ఎలక్ట్రిక్ కారు పేలడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని గుర్తించారు. సమాచారం తెలుసుకున్న డచ్‌ కోస్ట్‌ గార్డ్‌ వెంటనే హెలికాప్టర్లు, బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా వారిని రెస్క్యూ టీమ్ కాపాడి బయటకు తీసుకొచ్చింది. వారిలో పలువురికి గాయాలయ్యాయి.


Similar News