French Prime Minister : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మైఖేల్ బార్నియెర్‌.. ఈయన ఎవరు?

దిశ, నేషనల్ బ్యూరో : ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా మైఖేల్ బార్నియెర్‌ నియమితులయ్యారు.

Update: 2024-09-05 12:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా మైఖేల్ బార్నియెర్‌ నియమితులయ్యారు. గతంలో యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన బ్రెగ్జిట్ వ్యవహారంలో జరిగిన చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన అనుభవం ఈయన సొంతం. అందుకే 73 ఏళ్ల మైఖేల్ బార్నియెర్‌‌ను ప్రధాని పదవికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎంపిక చేశారు. 2021 సంవత్సరంలో జరిగిన ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించి మైఖేల్ బార్నియెర్‌ భంగపడ్డారు.

ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాల్లోకి వలసలు మితిమీరిన స్థాయిలో జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని చాలా వేదికలపై ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఫ్రాన్స్ ప్రధానిగా అవకాశాన్ని దక్కించుకున్న బార్నియెర్‌.. ఆ దేశ ఇమిగ్రేషన్ విధానంలో ఎలాంటి మార్పులు చేస్తారో వేచిచూడాలి.


Similar News