Knife Attack:కొమొరోస్ అధ్యక్షుడిపై కత్తితో దాడి చేసిన పోలీస్

హిందూ మహాసముద్ర(Indian Ocean) ద్వీప దేశమైన కొమొరోస్ ప్రెసిడెంట్(Comoros President) అజాలీ అసౌమని(Azali Assoumani)పై కత్తితో దాడి(Knife Attack)జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-09-15 00:38 GMT

దిశ, వెబ్‌డెస్క్:హిందూ మహాసముద్ర(Indian Ocean) ద్వీప దేశమైన కొమొరోస్ ప్రెసిడెంట్(Comoros President) అజాలీ అసౌమని(Azali Assoumani)పై కత్తితో దాడి(Knife Attack) జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే..కొమొరోస్ రాజధాని మొరోని(Moroni)కి ఉత్తరాన ఉన్న సాలిమాని ఇట్సాండ్రా (Salimani Itsandra) పట్టణంలో మతపరమైన నేత అంతక్రియలకు అజాలీ హాజరైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది.24 ఏళ్ల పోలీసు కత్తితో దాడి చేయడంతో అధ్యక్షుడు స్వల్ప గాయాలతో బయటపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కొన్ని కుట్లు వేయబడ్డాయని ఇంధన మంత్రి(Energy Minister) అబౌబాకర్ సైద్ అన్లీ(Aboubacar Saïd Anli ) శనివారం మొరోనిలో విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, దాడి చేసిన వ్యక్తిని అహ్మద్ అబ్దు(Ahmed Abdou) గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నామని కొమొరోస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలీ మొహమ్మద్ డ్జౌనైడ్(Ali Mohamed Djounaid) ఓ ప్రకటనలో తెలిపారు.దాడికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.కాగా అసౌమని గత మే నెలలో కొమొరోస్ ప్రెసిడెంట్ పదవికి నాలుగో సారి ఎన్నికయ్యారు.ఈ ఎన్నికల్లో అసౌమని రిగ్గింగ్ చేసి గెలిచారని, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


Similar News