Israel - Hamas War : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి గుర్తుండే ఉంటుంది.

Update: 2024-08-18 20:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి గుర్తుండే ఉంటుంది.గత శనివారం గాజా నగరానికి దక్షిణంగా ఇజ్రాయెల్ సైనికులను చంపి గాయపరిచామని హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.ఈ మేరకు సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని 40 మిలిటెంట్ల స్థావరాలపై బాంబు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గత కొన్ని గంటల్లో గాజా స్ట్రిప్‌లోని 40 ఉగ్రవాద లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఆ దేశ మిలిటరీ ప్రతినిధి అవిచాయ్ అడ్రే (Avichay Adraee) ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఇదిలావుండగా, గాజా నగరానికి దక్షిణాన తమ మిలిటెంట్లు కొంతమంది ఇజ్రాయెల్ సైనికులను చంపి గాయపరిచారని హమాస్ సాయుధ విభాగం అల్-కస్సామ్ బ్రిగేడ్స్(Al-Qassam Brigades) శనివారం ప్రకటించింది. "మా తీవ్రవాదులు గాజా నగరానికి దక్షిణంగా ఉన్న తాల్ అల్-హవా (Tal al-Hawa) ప్రాంతంలోని యూనివర్శిటీ కళాశాల పరిసరాల్లో రెండు ఆర్మీ జీపుల్లో రెండు బాంబులను పేల్చారు" అని అల్-కస్సామ్ బ్రిగేడ్స్ పేర్కొంది. మిలిటెంట్లు మిగిలిన సైనికులతో మెషిన్ గన్‌లతో ఘర్షణ పడ్డారని, వారిలో కొందరిని చంపి, గాయపరిచారని ప్రకటన పేర్కొంది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించలేదు.గాజాలో భద్రతాపరమైన ఘటనలో మొత్తం 11 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ (Kan TV) న్యూస్ నివేదించింది. ఈ ఘటనకు సంబంధించి తదుపరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Similar News