డ్యాన్స్ చేశారని ఇద్దరు యువతులు అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌లో మహిళల అణచివేత కొనసాగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. మార్చి 20న పర్షియన్ నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. దీన్ని పురస్కరించుకొని ఇటీవల ఇద్దరు యువతులు తజ్రిష్ స్క్వేర్ అనే ప్రదేశంలో బహిరంగంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈవిషయం చివరకు కోర్టుకు చేరింది. దీంతో ఆ ఇద్దరు మహిళలను అరెస్టు చేయాలని ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని కోర్టు ఆదేశించింది. ఆ డ్యాన్స్ చేసే క్రమంలో సదరు మహిళలు ధరించిన దుస్తులు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ఆ ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు బహిరంగంగా డ్యాన్స్ చేయడం అనేది ఇరాన్‌లో అమలవుతున్న ఇస్లామిక్ చట్టాల ప్రకారం నేరం.