US President Elections: ట్రంప్ ని ఓడించడమే లక్ష్యం- కమలా హ్యారిస్

అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్ కు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ధన్యవాదాలు తెలిపారు.

Update: 2024-07-22 04:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్ కు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ధన్యవాదాలు తెలిపారు. డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రిపబ్లికన్‌(Republican party) అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ని(Donald Trump) ఓడించడమే ముందున్న లక్ష్యమని ప్రకటించారు. ఆయన అతివాద ‘ప్రాజెక్టు 2025’ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే ప్రస్తుత కర్తవ్యం అని అన్నారు. సొంతపార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో అమెరికా(America) అధ్యక్ష రేసు నుంచి డెమొక్రటిక్‌(Democratic Party) అభ్యర్థి జో బైడెన్‌ (Joe Biden) వైదొలగారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్‌ (Biden) ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు (Kamala Harris) ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.

కమలాహ్యారిస్ ఏమన్నారంటే?

కమలా హారిస్‌ (Kamala Harris) అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్‌ ఆమె రికార్డు నెలకొల్పారు. ‘‘అధ్యక్షుడి ఆమోదం పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ నామినేషన్‌ను సాధించి, గెలవడమే నా ఉద్దేశం’’ అని కమలా అన్నారు. అధ్యక్షుడిగా జో బిడెన్ అసాధారణ నాయకత్వానికి, మన దేశానికి దశాబ్దాలుగా చేసిన సేవలకు అమెరికా ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తానని.. 107 రోజులు కలిసికట్టుగా పోరాడి గెలుస్తాని అన్నారు. ఇకపోతే, అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డెమోక్రాట్లలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బైడెన్‌ మద్దతు ఉండడం కమలా హారిస్‌కు కలిసొచ్చే అంశం. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కూడా కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపారు. అయినప్పటికీ.. ఆగస్టు 19న చికాగోలో జరిగే డెమోక్రటిక్‌ జాతీయ సదస్సులో కమలాహ్యారిస్ పేరు పార్టీ ప్రతినిధుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.


Similar News