మస్కట్ మసీదులో కాల్పులు..ఓ భారతీయుడు సహా ఆరుగురు మృతి

ఒమన్ రాజధాని మస్కట్‌లోని షియా మసీదులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఓ భారతీయుడు సహా ఆరుగురు మరణించగా..మరో 28 గాయపడ్డట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.

Update: 2024-07-17 17:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒమన్ రాజధాని మస్కట్‌లోని షియా మసీదులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఓ భారతీయుడు సహా ఆరుగురు మరణించగా..మరో 28 గాయపడ్డట్టు అధికారులు తాజాగా వెల్లడించారు. మరణించిలో వారిలో ముగ్గురు పాకిస్థానీయులు కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన భారతీయుడిని బాషా జాన్ అలీ హుస్సేన్‌గా మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం గుర్తించింది. దాడిలో మరో ముగ్గురు భారతీయులు కూడా గాయపడ్డట్టు తెలిపింది. కాల్పుల ఘటన తర్వాత భారతీయుల సంక్షేమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. హుస్సేన్ మృత దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు భారతీయులను ఎంబసీ అధికారులు పరామర్శించారు. అక్కడి రాయబారి నారంగ్ కూడా వారి కుటుంబాలతో మాట్లాడి పూర్తి సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

Similar News