Fire Accident : జాయింట్ వీల్ లో అగ్ని ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు..!

జాయింట్ వీల్ లేదా ఫెర్రస్ వీల్ ఎక్కడమంటే అందరికీ సరదానే.

Update: 2024-08-18 19:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాయింట్ వీల్ లేదా ఫెర్రస్ వీల్ ఎక్కడమంటే అందరికీ సరదానే. కొందరు దీన్ని ఎక్కిన తరువాత ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తారు. కానీ ఆ తరువాత మళ్లీ దాన్ని ఎక్కడానికి ఇష్టపడతారు.వివరాల్లోకెళ్తే.. తూర్పు జర్మనీలోని లీప్‌జిగ్ నగరానికి సమీపంలో సమ్మర్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. సరదా కోసమని కొంత మంది జాయింట్ వీల్ ఎక్కారు. వీల్ లో సంతోషంగా కేరింతలు కొడుతూ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతలోనే విషాద ఘటన చోటు చేసుకుంది. సమ్మర్‌ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన ఫెర్రిస్ వీల్‌ తిరుగుతుండగానే వీల్ లో ఉన్న రెండు కేబుల్ కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.దట్టమైన పొగ కమ్ముకోవడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫెస్టివల్ నిర్వాహకులు జాయింట్‌ వీల్‌ తిరగకుండా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించారు.కాగా ఈ ఘటనలో మొత్తం 30 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీల్ లోని టెక్నికల్ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు . కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


Similar News