Earthquake : రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదు

ఆదివారం రష్యా దేశాన్ని భారీ భూకంపం వణికించింది .

Update: 2024-08-18 21:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం రష్యా దేశాన్ని భారీ భూకంపం వణికించింది . స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతగా నమోదయింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూ కదలికలు సంభవించాయని USGS తెలిపింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి.కాగా ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమీ జరుగలేదని అధికారులు వెల్లడించారు.

పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీ ప్రాంతం రష్యా నౌకాదళానికి కీలకమైన ప్రాంతం. ఈ నగరంలో దాదాపుగా లక్ష 80 వేల మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ చాలా అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూకంప తీవ్రత ధాటికి షివేలుచ్ అనే  అగ్నిపర్వతం బద్దలయ్యింది.అగ్నిపర్వతం బద్దలవడంతో సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతోంది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగం నేవీ బేస్ ఆధీనంలోనే ఉంది. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కానీ కొద్దిసేపటి తర్వాత సునామా హెచ్చరికలను ఉపసంహరించుకుంది.


Similar News